![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -104 లో.....ప్రేమ ధీరజ్ లు అసలు ఎమన్నా తిన్నారో లేదోనని పాలు తీసుకొని వచ్చి ధీరజ్ కి ఇస్తుంది వేదవతి. కానీ వేదవతితో ధీరజ్ మాట్లాడడానికి ఇష్టపడడు. మీరు మాట్లాడకపోయిన పర్వాలేదు కానీ ఆ పాలు అయినా తాగండి అంటూ వేదవతి బాధపడుతూ వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ లేదు దూరం ఉంది.. సఖ్యత లేదని వేదవతి బాధపడుతుంది. అప్పుడే నర్మద, సాగర్ లు వేరువేరుగా పడుకోవడం చూసి వీళ్ళకి ఏమైందని వేదవతి అనుకుంటుంది.
మరుసటిరోజు భాగ్యం తన భర్తని ఇడ్లీ అమ్మడానికి పంపిస్తుంది. శ్రీవల్లి ఉప్మా ప్లేట్ లో బావ అని రాసి ఫోటో తీసి చందుకి పంపిస్తుంది. అది చూసి చందు ఫోన్ చేస్తాడు. చందు ఫోన్ చెయ్యగానే శ్రీవల్లి మెలికలు తిరుగుతుంది. మిమ్మల్ని బావ అనొచ్చా అని శ్రీవల్లి అనగానే అనొచ్చు అని చందు అంటాడు. దాంతో శ్రీవల్లి సిగ్గుపడుతుంది అదంతా చుసిన భాగ్యం అబ్బాయి దార్లోకి వస్తున్నాడని అనుకుంటుంది. శ్రీవల్లి పంపిన ఫోటోని తిరుపతి చూసి చందుని ఆటపట్టిస్తాడు.
ఆ తర్వాత వేదవతి కిచెన్ లో ఉండగా.. నర్మద వచ్చి టీ అడుగుతుంది. వేదవతి టీ ఇస్తుంది. సాగర్ కి నీకు ఏదైనా గొడవ జరిగిందా.. వేరువేరుగా పడుకున్నారని వేదవతి అడుగగా.. మాకేం గోడవలు లేవని చెప్పి నర్మద ఆఫీస్ కి వెళ్తుంది. అప్పుడే సాగర్ వస్తాడు.. మీకేం గొడవ అయింది చెప్పకుంటే నాపైన ఒట్టేనని సాగర్ తో వేదవతి అనగానే.. అన్నయ్యకి పెళ్లి కాకుండా మనం పిల్లలిని కంటే బాగోదని నర్మదా చెప్పిందని వేదవతితో సాగర్ అంటాడు. చిన్నపిల్ల అయిన బాగా ఆలోచించిందని వేదవతి అంటుంది. అదంతా రామరాజు వింటాడు. తరువాయి భాగంలో ప్రేమ కాఫీ షాప్ లో పని చెయ్యడం భద్రవతి వాళ్ళు చూస్తారు. ఇంటికి వచ్చి రామరాజుపై గొడవకి దిగుతారు. నువ్వే నా కోడలిని పంపిస్తున్నావంటు రామరాజుపై భద్రవతి విరుచుకుపడుతుంది. ఆ తర్వాత ఎం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.
![]() |
![]() |